logo

రైతుల ఆగ్రహం

స్థానిక గ్రోమోర్‌ కేంద్రం వద్ద ఎరువుల కోసం రైతులు శనివారం ఆందోళనచేశారు.  ఆన్‌లైన్‌ సమస్యలతో మూడురోజులుగా యూరియా కోసం పడిగాపులు కాచి చివరికి ఆందోళన చేపట్టారు.

Updated : 05 Feb 2023 02:26 IST

గ్రోమోర్‌ ఎదుట ఆందోళన చేపట్టిన రైతులు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: స్థానిక గ్రోమోర్‌ కేంద్రం వద్ద ఎరువుల కోసం రైతులు శనివారం ఆందోళనచేశారు.  ఆన్‌లైన్‌ సమస్యలతో మూడురోజులుగా యూరియా కోసం పడిగాపులు కాచి చివరికి ఆందోళన చేపట్టారు. ఆన్‌లైన్‌ సర్వర్లు పనిచేయలేదని కొన్నిరోజులుగా తిప్పుకొంటున్నారు. రైతు సంఘం నాయకులు ఎల్‌.కె. ప్రసాద్‌,  తెదేపా పట్టణ అధ్యక్షుడు టి.చంద్రారెడ్డి రైతులతో కలసి పాల్గొన్నారు. అధికారులతో మాట్లాడారు. ఆపై రైతులకు టోకెన్లు ఇచ్చి ఎరువులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని