logo

అర్హత సాధిస్తే ఉపకారం

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌) పథకాన్ని అమలు చేస్తోంది.

Published : 05 Feb 2023 01:19 IST

నేడు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష
హాజరు కానున్న 3,369 మంది విద్యార్థులు
న్యూస్‌టుడే, నెల్లూరు (విద్య)

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌) పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు నిర్వహిసున్న ప్రవేశ పరీక్షను ఏటా పెద్ద సంఖ్యలో రాస్తున్నారు. మంచి మార్కులు వస్తే ఈ సాయం అందుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ పథకాన్ని 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆదివారం ఈ పరీక్ష జిల్లా వ్యాప్తంగా నెల్లూరు, కావలి, ఆత్మకూరు, కందుకూరు రెవెన్యూ డివిజన్లలో నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 18 కేంద్రాల్లో 3,369 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది.

నాలుగేళ్లపాటు సాయం

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష రాసే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షకు సిద్ధం చేశారు. అర్హత పొందిన విద్యార్థులకు రిజర్వేషన్‌ ప్రకారం పథకం వర్తింపజేస్తారు. 9, 10, ఇంటర్‌ రెండేళ్లు, ఐటీఐ చదివితే ఏడాదికి రూ.12 వేలు చొప్పున నాలుగేళ్లపాటు ఉపకార వేతనం అందుతుంది.


ఏర్పాట్లు పూర్తి
గ్లోరికుమారి, ఇన్‌ఛార్జి విద్యాశాఖాధికారిణి

జిల్లాలోని 18 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. నెల్లూరులో ఆరు, కావలిలో అయిదు, ఆత్మకూరులో నాలుగు, కందుకూరులో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 3,369 మంది పరీక్షకు హాజరు కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని