logo

పిడికిళ్లు బిగించి.. డిమాండ్లపై నినదించి...

అంగన్‌వాడీ కార్యకర్తలు కన్నెర్ర జేశారు. తమ డిమాండ్ల సాధనకు కదం తొక్కారు. సోమవారం నెల్లూరులోని వీఆర్సీ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Published : 07 Feb 2023 02:35 IST

ధర్నాలో భాగంగా కలెక్టరేట్‌ ఎదుట నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కార్యకర్తలు కన్నెర్ర జేశారు. తమ డిమాండ్ల సాధనకు కదం తొక్కారు. సోమవారం నెల్లూరులోని వీఆర్సీ కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు సహాయకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముఖహాజరు రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు తీరు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, పదవీ విరమణ ప్రయోజనాలు రూ. అయిదు లక్షలు, వేతనంలో సగం పింఛను ఇవ్వాలని కోరారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, తమకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌కే రెహనాబేగం, వై.సుజాతమ్మ, పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు