logo

ఎల్‌ఐసీ కార్యాలయం ముట్టడి

జిల్లా కాంగ్రెస్‌ నాయకులు తలపెట్టిన ఎల్‌ఐసీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరం, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు.

Published : 07 Feb 2023 02:35 IST

కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న నాయకులు చేవూరు
దేవకుమార్‌రెడ్డి, సీవీ శేషారెడ్డి, వెంకట్రావు తదితరులు

నెల్లూరు (జడ్పీ), న్యూస్‌టుడే : జిల్లా కాంగ్రెస్‌ నాయకులు తలపెట్టిన ఎల్‌ఐసీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరం, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ట్రంకురోడ్డు మీదుగా బృందావనం సమీప ఎల్‌ఐసీ వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యాలయ ఆవరణలో బైఠాయించి ఉద్యోగులు, సిబ్బందిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. లక్షలాది మంది జీవిత భీమా ఉద్యోగులు, ఖాతాదారులను మోసం చేస్తూ ఆ సంస్థకు చెందిన రూ.వేల కోట్ల నిధులు తన స్నేహితుడైన అదానీకి అప్పగించారని విమర్శించారు. ఆర్థిక నేరస్థులకు ఆయన కొమ్ము కాస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి మాట్లాడుతూ భాజపా ప్రభుత్వంలో దేశ ఆర్థిక పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. నాయకులు ఉడతా వెంకట్రావు, తేళ్లపల్లి సురేష్‌బాబు, చింతాల వెంకట్రావు, డి.రమేష్‌నాయుడు, ఏటూరి శ్రీనివాసులరెడ్డి, అనిల్‌కుమార్‌, అల్లాఉద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా లతారెడ్డిని పార్టీ ఎంపిక చేసింది. ఈమేరకు ఆమెకు పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి ఉత్తర్వులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని