logo

రామాయపట్నంలో.. రెండు క్యాప్టివ్‌ బెర్తుల ఏర్పాటుకు 250 ఎకరాలు

రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా- అందులో రెండు క్యాప్టివ్‌ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు 250 ఎకరాలను లీజు ప్రాతిపాదికన కేటాయించే ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Published : 09 Feb 2023 01:22 IST

కొనసాగుతున్న ఓడరేవు పనులు

గుడ్లూరు, న్యూస్‌టుడే: రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా- అందులో రెండు క్యాప్టివ్‌ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు 250 ఎకరాలను లీజు ప్రాతిపాదికన కేటాయించే ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గుడ్లూరు మండలంలోని మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామాల పరిధిలో ఓడరేవు నిర్మించనుండగా.. ఇప్పటికే దీనికోసం 825 ఎకరాలు కేటాయించారు. ఈ గ్రామాల వారికి పునరావాసం కల్పించేందుకు భూములను ఎంపిక చేశారు. తాజాగా జేఎస్‌డబ్ల్యూ అనుబంధ పరిశ్రమల నిర్మాణంతో గుడ్లూరు, ఉలవపాడు, కావలి ప్రాంత ప్రజలకు మేలు జరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఇండ్‌సోల్‌ పరిశ్రమ కోసం భారీగా భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థ ఇక్కడ సౌర ఫలకలు ఏర్పాటు చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని