logo

నిల్వలు చూస్తే ‘తెల్ల’బోతారంతే..

జిల్లాలో తెల్లరాయి దందాకు అడ్డుకట్ట పడటం లేదు. రాజకీయమే అండగా యథేచ్ఛగా కొండలను పిండి చేసి సొమ్ము చేసుకుంటున్నారు.  

Published : 09 Feb 2023 01:22 IST

ప్రభగిరిపట్నం సమీపంలో ఒక పొలంలో కంకర పగలగొడుతున్న కూలీలు

పొదలకూరు, న్యూస్‌టుడే: జిల్లాలో తెల్లరాయి దందాకు అడ్డుకట్ట పడటం లేదు. రాజకీయమే అండగా యథేచ్ఛగా కొండలను పిండి చేసి సొమ్ము చేసుకుంటున్నారు.  ఆ క్రమంలో రోడ్డు మార్గంలో  రవాణాకు వీలుగా తెల్ల కంకరను అక్రమంగా తరలించి నిల్వ చేస్తున్నారు. ప్రభగిరిపట్నం, నందివాయి, తాటిపర్తి, దుగ్గుంటలో నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి.. బయటి ప్రాంతాల నుంచి పెద్ద పరిమాణంలోని రాళ్లును తెచ్చి కూలీలు, యంత్రాలతో పగలగొట్టిస్తున్నారు. ఆపై చెన్నై, కృష్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకూ తరలిస్తున్నారు. రెవెన్యూ, అటవీశాఖల పర్యవేక్షణ కొరవడటంతో విచ్చలవిడిగా కొండలను పిండి చేసి కంకర తరలిస్తున్నారు. అసైన్డ్‌ ద్వారా పట్టాలు పొందిన భూములను నిల్వ కేంద్రాలుగా వినియోగిస్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని