logo

పేద విద్యార్థులకు అన్యాయం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులకు అన్యాయం చేస్తూ వారిని చదువులకు దూరం చేస్తున్నాయని పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్‌ రామకృష్ణ అన్నారు.

Published : 09 Feb 2023 01:22 IST

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులకు అన్యాయం చేస్తూ వారిని చదువులకు దూరం చేస్తున్నాయని పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్‌ రామకృష్ణ అన్నారు. బుధవారం నగరంలోని కృష్ణచైతన్య కళాశాలలో ఆ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్‌ లౌకిక సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన విద్యా విధానం పేరుతో విద్యను కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 0.38 శాతం కేటాయించడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. పీజీ, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు అందించాలని డిమాండ్‌ చేశారు. వీరిని ఆదుకోకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారన్నారు. రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీగా నిధులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సునీల్‌, కార్యదర్శి లోకేశ్‌, షారూక్‌, ఆశీర్వాదం, విష్ణు, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని