logo

ముందస్తు ఉగాది వేడుకలు

ప్రపంచ తెలుగు సమాఖ్య, నెల్లూరు ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కనుపర్తిపాడులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటరులో ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించారు.

Updated : 20 Mar 2023 05:56 IST

యువతుల నృత్యాభినయం

నెల్లూరు(నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: ప్రపంచ తెలుగు సమాఖ్య, నెల్లూరు ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కనుపర్తిపాడులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటరులో ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ప్రాముఖ్యత, తెలుగుభాష గొప్పతనాన్ని వివరించారు. సురభిగాయత్రి శిష్య బృందం కూచిపూడి నృత్యం, కేఎస్‌ రాఘవాచార్యుల శోభకృత్‌ నామ సంవత్సర పంచాంగ పఠనం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్‌ వీఏ ఇందిరాదత్‌, వి.ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని