logo

యువత.. ఆటల్లో ఘనత

యువత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు అహరహం శ్రమిస్తుంది. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకుంటూనే క్రీడల్లో పట్టు సాధిస్తున్నారు.

Published : 20 Mar 2023 05:28 IST

బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలు

న్యూస్‌టుడే, కావలి: యువత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు అహరహం శ్రమిస్తుంది. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకుంటూనే క్రీడల్లో పట్టు సాధిస్తున్నారు. పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. ఇలా జిల్లా, రాష్ట్రాన్ని దాటి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా జరిగే పోటీల్లో ప్రతిభ చూపేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి వారిలో ఇటీవల కావలి పట్టణంలో జరిగిన బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల్లో విజేతలై రాష్ట్ర జట్టుకు పలువురు ఎంపికయ్యారు. వీరి ప్రతిభపై కథనం.


క్రీడలంటే ప్రాణం
- పడాల సాంబశివ, జాతీయ స్థాయికి ఎంపికైన యువకుడు

విద్యాభ్యాసం: డిగ్రీ ద్వితీయ సంవత్సరం
తల్లిదండ్రులు: రాజు, దేవి, వ్యవసాయ కార్మికులు
క్రీడలంటే నాకు ఇష్టం. నేను చదువుకుంటూ బాల్‌ బ్యాడ్మింటన్‌లో సాధన చేశా. గతంలో 2017-18వ సంవత్సరంలో సబ్‌ జూనియర్‌ నేషనల్స్‌, స్టార్‌ ఇండియా పోటీల్లో జట్టును ప్రథమ స్థానంలో నిలపడంలో కృషి చేశా. అంతకుముందు 2020-21 జూనియర్‌ నేషనల్స్‌లోనూ జట్టును ద్వితీయ స్థానంలో నిలిపా. గత జనవరిలో జరిగిన అఖిల భారత  క్రీడా పోటీల్లోనూ తృతీయ స్థానంలో ఉన్నాం. బెస్ట్‌ ఆటగాడిగా ప్రశంసాపత్రం లభించింది. క్రీడలకు ఇచ్చే రిజర్వేషన్‌ ద్వారా రైల్వే శాఖలో ఉద్యోగం సాధిస్తా.


జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటుతా
- యాకా హిమబిందు, యువ క్రీడాకారిణి

విద్యాభ్యాసం: బీటెక్‌ ద్వితీయ సంవత్సరం
తండ్రి: శ్రీను, ఎలక్రీ¨్టషియన్‌
తల్లి: బుజ్జమ్మ, గృహిణి
త్వరలో జరిగే జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో సత్తా చాటుతా. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తా. గతంలో సబ్‌జూనియర్స్‌ విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో జట్టును నిలిపాం. వివిధ క్రీడా పోటీల్లో కూడా పాల్గొంటున్నా. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో ఆడతా. దేశానికి క్రీడా ఖ్యాతి ఇనుమడింపజేయాలనేదే ధ్యేయం.


అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తా
- ఎం.రాధా స్రవంతి

విద్యాభ్యాసం: డిగ్రీ ప్రథమ సంవత్సరం
తండ్రి- అప్పారావు, రైతు
తల్లి- రమణమ్మ, గృహిణి
నేను పదో తరగతి చదువుతున్నప్పుడే (2020వ సంవత్సరం) సబ్‌ జూనియర్‌ విభాగం నుంచి బాల్‌బ్యాడ్మింటన్‌ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నా.. నాడు జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. అప్పట్లో శ్రీలంకపై గెలుపొందాం. ఇప్పుడు   19 సంవత్సరాల లోపు జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. తప్పక విజయం సాధిస్తాం. క్రీడా కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని