logo

‘వై నాట్‌ ప్రగల్భాలకు గుణపాఠం’: సోమిరెడ్డి

‘వై నాట్‌.. 175’ అని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పట్టభద్రులు గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

Published : 20 Mar 2023 05:28 IST

సమావేశంలో ప్రసంగిస్తున్న సోమిరెడ్డి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ‘వై నాట్‌.. 175’ అని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పట్టభద్రులు గుణపాఠం చెప్పారని మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా అభ్యర్థులకు పీడీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, భాజపా మద్దతుదారులు రెండో ప్రాధాన్యత ఓటును వేసి ఆశీర్వదించారన్నారు. ఈ క్రమంలో ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వేలాది ఓట్లు చెల్లకపోవడానికి వైకాపా చేర్చిన ఆరు నుంచి పదో తరగతి అర్హత కలిగిన ఓటర్లే కారణమన్నారు. అక్రమ సొత్తు వాటాలు పంచుకోవడంలో కాకాణి, పేర్నాటి మధ్య విభేదాలున్నాయనీ, వాటిని సెటిల్మెంట్‌ చేయడంలో సజ్జల విఫలమయ్యారన్నారు. నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ వైకాపా దుర్మార్గపు పాలనలో రైతులు, చిరువ్యాపారులు, సామాన్యులు బాధితులుగా మారారన్నారు. నాయకులు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, జలదంకి సుధాకర్‌, రాజానాయుడు, పెంచలనాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని