logo

వెంగమాంబ సన్నిధిలో ఉగాది వేడుకలు

మండల పరిధిలోని నర్రవాడలో వెలసి ఉన్న వెంగమాంబ అమ్మవారి దేవస్థానంలో బుధవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గర్భగుడితో పాటు ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.

Published : 23 Mar 2023 02:33 IST

అలంకరణలో వెంగమాంబ దంపతులు

దుత్తలూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని నర్రవాడలో వెలసి ఉన్న వెంగమాంబ అమ్మవారి దేవస్థానంలో బుధవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గర్భగుడితో పాటు ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వెంగమాంబ దంపతులకు కల్యాణాన్ని ఏర్పాటు చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా వెంగమాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఉగాది విశిష్టతను వివరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో ఉషశ్రీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.


సిద్ధేశ్వరంలో

సీతారామపురం మండలం సిద్ధేశ్వరంలోని ఇష్టకామేశ్వరీదేవి

సీతారామపురం, న్యూస్‌టుడే: మండలంలో పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. సీతారామపురంలోని గ్రామదేవత అంకాళమ్మ, ప్రాచీనశైవక్షేత్రం ఘటిక సిద్ధేశ్వరంలో పరమశివుడు, ఇష్టకామేశ్వరీదేవి ఆలయాలతోపాటు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడి తయారు చేసి భక్తులు పంచారు.


బాలాజీనగర్‌లో పంచాంగం పఠిస్తున్న వేదపండితులు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే : నగరంలోని బాలాజీనగర్‌ ఉగాది సెంటరులోని వినాయకుడి గుడి వద్ద సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పంచాంగ పూజ, రుద్రాభిషేకం, పంచాంగ పఠనం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పంచాంగ పూజను పల్లెకొండ సురేష్‌శర్మ, వేద పండితులు అవధానం బాలసుబ్రహ్మణ్యం నిర్వహించగా.. పంచాంగ ఫలాన్ని మాచవోలు రమేష్‌శర్మ విపులీకరించారు. 500 మందికి పంచాంగ పుస్తకాలు ప్రదానం చేసి కాణిపాకం ప్రసాదాన్ని భక్తులకు అందించారు. కార్యక్రమంలో నుడా మాజీ ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సింహపురి ధార్మిక సంస్థ వ్యవస్థాపకులు ఉచ్చి భువనేశ్వరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని