logo

క్షయ కుంగదీస్తోంది!

(మొదటిపేజీ తరువాయి) పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. చికిత్సా కాలం ఆరునెలలు లేదా ఎనిమిది నెలలు.

Updated : 24 Mar 2023 06:30 IST

(మొదటిపేజీ తరువాయి) పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. చికిత్సా కాలం ఆరునెలలు లేదా ఎనిమిది నెలలు. ముదిరితే (షార్టర్‌ రెజిమెన్‌ లేదా ఆల్‌ ఓరల్‌ లాంగర్‌ రెజిమెన్‌) తొమ్మిది నెలలు లేదా 24 నెలలు చికిత్స అందిస్తారు. క్షయ తీవ్రత ఎండీఆర్‌ (మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌) గుర్తించేందుకు డామియర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరు భక్తవత్సలనగర్‌లో అధునాతన పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాధారణ స్థాయికి ప్రత్యక్ష వైద్య సిబ్బంది పర్యవేక్షణలో డాట్స్‌ పద్ధతిలో మందులతో చికిత్స అందిస్తారు. తీవ్రతను బట్టి రూ.రెండు లక్షల వరకు విలువైన చికిత్సను ఉచితంగా అందజేస్తారు. బాధితులకు మంచి పోషకాహారం అందించేందుకు ప్రతినెల రూ.500 ఇచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2022లో 3,986 మంది క్షయ బాధితులకు పౌష్టికాహారం నిమిత్తం రూ.కోటి వారి ఖాతాల్లో జమ చేశారు.

విస్తృతంగా వైద్యసేవలు

డాక్టర్‌ వెంకటప్రసాద్‌, జిల్లా క్షయ నివారణాధికారి

క్షయ నివారణకు విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నాం. దీని నివారణకు అధునాతన వైద్య సేవలందిస్తున్నాం. గత ఏడాది 3 వేల మందికిపైగా బాధితులు కోలుకున్నారు. 90 శాతం లక్ష్యాలు సాధించాం. నెల్లూరు జీజీహెచ్‌లో అత్యాధునిక సీబీనాట్‌ పరికరం అందుబాటులో ఉంది. దీని ద్వారా వ్యాధిని త్వరగా నిర్ధారించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని