logo

వైకాపా పతనానికి నాంది: బీద

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెదేపా అభ్యర్థిని పంచుమర్తి అనూరాధకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 24 Mar 2023 06:18 IST

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తెదేపా అభ్యర్థిని పంచుమర్తి అనూరాధకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అనూరాధ విజయం వచ్చే ఎన్నికల్లో వైకాపా పతనానికి నాంది కానుందని పేర్కొన్నారు.

* అనూరాధ గెలుపు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కార్యదక్షతకు నిదర్శనమని తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి ఆలూరు వెంకటేశ్వర్లు చౌదరి తెలిపారు. ఆపార్టీ నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ జడ్పీ ఛైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

* వేదాయపాళెం కూడలిలో గురవారం మాజీ కార్పొరేటర్‌ దొడ్డపనేని రాజానాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. పెద్దఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలను పంచిపెట్టాయి. కార్యక్రమంలో నాయకులు పెంచలనాయుడు, సాబీర్‌ఖాన్‌, జలదంకి సుధాకర్‌, శివాచారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని