logo

నష్టపోయిన వారిని ఆదుకుంటాం

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి జి.సుధాకర్‌ రాజు మండల పరిధిలోని కొత్తపల్లిలో శుక్రవారం పరిశీలించారు.

Published : 25 Mar 2023 05:34 IST

పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు

కావలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి జి.సుధాకర్‌ రాజు మండల పరిధిలోని కొత్తపల్లిలో శుక్రవారం పరిశీలించారు. రైతు భరోసా కేంద్రంలో స్థానిక రైతులతో చర్చించారు. అనంతరం పంటలు నష్టపోయిన తీరును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ 33 శాతానికి పైగా నష్టం వాటిల్లితే  హెక్టారు  వరి పంటకు రూ.15 వేలు నష్టపరిహారం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో కావలి ఏడీఏ కన్నయ్య, ఏవో లలిత, తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు