logo

క్రమం తప్పకుండా పరిశ్రమల వార్షిక సర్వే

జాతీయ గణాంక కార్యాలయం 1960 నుంచి పరిశ్రమలపై వార్షిక సర్వే క్రమంతప్పకుండా నిర్వహిస్తుందని ఉప ప్రాంతీయ కార్యాలయాధికారి వై.ఫణీంద్రశర్మ తెలిపారు.

Published : 25 Mar 2023 05:34 IST

మాట్లాడుతున్న ఉప ప్రాంతీయ కార్యాలయాధికారి వై.ఫణీంద్రశర్మ

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జాతీయ గణాంక కార్యాలయం 1960 నుంచి పరిశ్రమలపై వార్షిక సర్వే క్రమంతప్పకుండా నిర్వహిస్తుందని ఉప ప్రాంతీయ కార్యాలయాధికారి వై.ఫణీంద్రశర్మ తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని శెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో తయారీ సంస్థలు, పరిశ్రమల యజమానులు, నిర్వాహకులకు వార్షిక పరిశ్రమల సర్వే రిటర్ను దాఖలుపై జిల్లా స్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పారిశ్రామిక ప్రగతిని అంచనా వేసేందుకు ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ఉపయోగపడుతుందన్నారు. ఏఎస్‌ఐ రిటర్ను దాఖలు చేసేందుకు కావాల్సిన ఆడిట్‌ రిపోర్టును ఉపయోగించి, వెబ్‌ మాధ్యమం ద్వారా నింపి ప్రభుత్వానికి దాఖలు చేయడంపై అవగాహన కల్పించారు. సదస్సులో సీనియర్‌ గణాంకాధికారులు ఫజులుల్లా, టి.రామకృష్ణ, వి.బాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు