logo

క్షయపై అవగాహన అవసరం

క్షయ వ్యాధిపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి పెంచలయ్య సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ జి.వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ప్రదర్శన జరిగింది.

Published : 25 Mar 2023 05:34 IST

ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో పెంచలయ్య

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: క్షయ వ్యాధిపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి పెంచలయ్య సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ జి.వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలో ప్రదర్శన జరిగింది. సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయం వరకు ఇది సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 40 వేల మందికి గళ్ల పరీక్షలు చేశామన్నారు. 3804 మందికి క్షయ ఉన్నట్లు గుర్తించి చికిత్స అందించడంతో పాటు డీబీటీ ద్వారా నెలకు రూ.500 చొప్పున వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కావలి ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ బ్రిజిత, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ, డాక్టర్‌ పవిత్ర, బొల్లినేని, సుచరిత నర్శింగ్‌ కళాశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. వ్యాధి నిర్మూలనకు కృషి చేసిన వారికి మెమొంటోలు, ప్రశంసాపత్రాలు ఇచ్చి సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు