logo

పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన సర్పంచి

మండలంలోని ఆత్మకూరు పంచాయతీ కార్యాలయానికి సర్పంచి నాళం గోవిందమ్మ శుక్రవారం కాసేపు తాళం వేయడంతో వివాదం నెలకొంది.

Published : 25 Mar 2023 05:34 IST

ఉలవపాడు, న్యూస్‌టుడే: మండలంలోని ఆత్మకూరు పంచాయతీ కార్యాలయానికి సర్పంచి నాళం గోవిందమ్మ శుక్రవారం కాసేపు తాళం వేయడంతో వివాదం నెలకొంది. పంచాయతీ కార్యాలయంలో నడుస్తున్న ఆర్బీకే ఆధ్వర్యంలో గ్రామంలోని ఐదుగురు రైతులు సంఘంగా ఏర్పడ్డారు. వీరికి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 50 శాతం లబ్ధిదారుల భాగస్వామ్యం ద్వారా   పనిముట్లు మంజూరయ్యాయి. గ్రామంలోని ఆర్బీకే వద్ద వ్యవసాయ పనిముట్లు తీసుకురాగా  రైతులు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సర్పంచి అక్కడికి చేరుకొని ప్రోటోకాల్‌ పాటించకుండా పంపిణీ చేయడం ఏమిటని కార్యాలయానికి తాళం వేయించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో చెంచమ్మ అక్కడికి చేరుకొని సర్పంచితో మాట్లాడి కార్యాలయం తాళాలు తీయించారు. వ్యవసాయ శాఖ ఏవో తిరుమలజ్యోతి మాట్లాడుతూ గ్రూపుగా ఏర్పడిన వారు పనిముట్ల కోసం కొంతనగదు కట్టారని, మిగిలిన నగదు బ్యాంకు రుణం మంజూరుచేయాల్సి ఉందన్నారు. వారిన పరిశీలన నిమిత్తం కార్యాలయం వద్ద ఉంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో రైతులు పనిముట్లను ఇళ్లకు తీసుకెళ్లడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని