logo

బ్యాంకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం

బ్యాంకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.30 లక్షలు స్వాహా చేసిన ఓ మోసగాడి వైనమిది. చిన్నబజారు పోలీసుల కథనం మేరకు..

Published : 26 Mar 2023 02:07 IST

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: బ్యాంకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.30 లక్షలు స్వాహా చేసిన ఓ మోసగాడి వైనమిది. చిన్నబజారు పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాలెం రేబాలకు చెందిన చంద్రగిరి మాలకొండయ్య ఆర్టీసీ నెల్లూరు-1 డిపొలో కండక్టరుగా పనిచేసి ప్రస్తుతం ఏడీసీగా పనిచేస్తున్నారు. ఏడాది క్రితం మాలకొండయ్యకు వేగూరు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి పరిచయమై బ్యాంకు ఉన్నతాధికారులతో  సంబంధాలు ఉన్నాయని, మీ కుమారుడు కార్తీక్‌కు ఎస్‌బీఐ బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకు పలుమార్లు రూ.30 లక్షలు  తీసుకున్నాడు. ఏడాది పూర్తయినా ఉద్యోగం ఇప్పించక, డబ్బులు తిరిగివ్వలేదు. దీంతో మోసపోయామని గుర్తించారు. కార్తీక్‌ శనివారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని