ఘనంగా సోమిరెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు
మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు తెదేపా మండలశాఖ అధ్వర్యంలో శనివారం నిర్వహించారు.
మనవడు, మనవరాలితో కలిసి కేక్ కట్ చేస్తున్న సోమిరెడ్డి
వెంకటాచలం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు తెదేపా మండలశాఖ అధ్వర్యంలో శనివారం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ ఏర్పాటు చేయగా కార్యకర్తల సమక్షంలో... మనవడు రణదేవ్‌రెడ్డి, మనవరాలు అమైరారెడ్డిలతో కలిసి సోమిరెడ్డి కేక్ కట్ చేశారు. జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు రక్తదానం చేశారు. నెల్లూరు ఎనెల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించి రోగులకు మందులు అందజేశారు. సెయింట్ జ్యూడ్స్ మానసిక వికలాంగుల కేంద్రంలోని దివ్యాంగులకు సోమిరెడ్డి దుస్తులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. రక్తదానం, వైద్యశిబిరాలను పరిశీలించిన సోమిరెడ్డి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండలశాఖ అధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్, జిల్లా నాయకులు కుంకాల నాగేంద్రప్రసాద్, రాధాకృష్ణనాయుడు, బొమ్మి సురేంద్ర పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)