logo

విజిబుల్‌ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణ: ఎస్పీ

జిల్లాలో నేరాల నియంత్రణకు విజిబుల్‌ పోలీసింగ్‌ అమలుచేయాలని ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఆదేశించారు. శనివారం ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో నేర సమీక్ష జరిగింది.

Published : 26 Mar 2023 02:31 IST

మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయరావు

నెల్లూరు (నేర విభాగం), న్య్టూుడే : జిల్లాలో నేరాల నియంత్రణకు విజిబుల్‌ పోలీసింగ్‌ అమలుచేయాలని ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఆదేశించారు. శనివారం ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో నేర సమీక్ష జరిగింది. జిల్లాలోని పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల పరిష్కారానికి సూచనలు ఇచ్చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాత్రి గస్తీ నిర్వహించే సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లలో సంబంధిత వ్యక్తులను న్యాయస్థానంలో హాజరుపరచాలన్నారు. కేసుల్లో న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఏపీపీ కేదార్‌నాథ్‌ వివరించారు. గుండెపోటుతో మృతి చెందిన ఆత్మకూరు సీఐ నాగేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని