logo

శ్రీరామనవమికి ముస్తాబు

శ్రీరామనవమి వేడుకలకు ఊరూవాడా ముస్తాబైంది. సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రానికి సంబంధించి..

Published : 30 Mar 2023 03:46 IST

న్యూస్‌టుడే, నెల్లూరు(సాంస్కృతికం): శ్రీరామనవమి వేడుకలకు ఊరూవాడా ముస్తాబైంది. సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రానికి సంబంధించి.. తితిదే కల్యాణ మండపం ఎదురుగా ఉన్న వేమాలశెట్టి బావి ప్రాంగణంలో కల్యాణ వేదికను సిద్ధం చేశారు. ఎనిమిది వేల మంది కల్యాణోత్సవాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. వేడుకలను పురస్కరించుకుని.. శనివారం దేవస్థానంలో పసుపు దంచి, సీతాదేవిని పెళ్లికుమార్తెను చేసి ప్రత్యేక పూజలు చేశారు.  


వేమాలశెట్టి బావి ప్రాంగణంలో కల్యాణోత్సవానికి సిద్ధమైన వేదిక

పసుపు దంచే కార్యక్రమంలో మహిళలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని