logo

మండల ఉపాధ్యక్షురాలి నిరసన

మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న సమయంలో వైస్‌ ఎంపీపీ శారమ్మ సభావేదికపై నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తన భర్తను పోలీసులు విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Published : 30 Mar 2023 03:46 IST

నిరసన తెలుపుతున్న మండల ఉపాధ్యక్షురాలు శారమ్మకు సర్దిచెబుతున్న అధికారులు

సీతారామపురం, న్యూస్‌టుడే:  మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్న సమయంలో వైస్‌ ఎంపీపీ శారమ్మ సభావేదికపై నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. తన భర్తను పోలీసులు విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మండల సర్వసభ్య సమావేశానికి మాజీ ఎంపీపీ నేలటూరి అబ్రహం తన భార్య వైస్‌ ఎంపీపీ శారమ్మను ద్విచక్రవాహనంపై తీసుకొని ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ద్విచక్రవాహనం ప్రాంగణంలో ఉంచరాదని దానిని అక్కడి నుంచి తొలగించి వేరే చోట నిలపాలని పోలీసులు చెప్పడంతో స్వల్ప వాగ్వాదం జరిగింది. పోలీసులు ఆయన్ను వాహనంలో స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై వైస్‌ ఎంపీపీ శారమ్మ మండల సర్వసభ్య సమావేశంలో సభావేదికపై నేలపై కూర్చొని తన భర్తను విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అధికారులు, నాయకులు పోలీసులకు సర్దిచెప్పడంతో మాజీ ఎంపీపీ అబ్రహంను పోలీసులు వదిలిపెట్టడంతో వివాదం సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని