logo

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు పనిచేద్దాం

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్లానింగ్‌శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ అన్నారు.

Published : 30 Mar 2023 03:46 IST

మాట్లాడుతున్న రాష్ట్ర ప్లానింగ్‌శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌

నెల్లూరు (కలెక్టరేట్) : సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్లానింగ్‌శాఖ కార్యదర్శి జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయకుమార్‌ అన్నారు. బుధవారం నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి అధికారులతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలు, స్పందనపై కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పని ఎవరికి చేస్తున్నాం.. ఎందుకు చేస్తున్నామనే ఆత్మావలోకనం చేసుకోవాలని తెలిపారు. నిజమైన అభివృద్ధికి పనిచేస్తున్న అవకాశం వచ్చినందుకు అదృష్టంగా భావించి ఇష్టంతో పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ జిల్లాలోని 725 సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. ఎస్పీ విజయరావు మాట్లాడుతూ ప్రతి వారం స్పందన కార్యక్రమంలో అందే వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ డి.హరిత, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ శోభిక, అదనపు ఎస్పీ హిమవతి, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవోలు మాలోల, శీనానాయక్‌, కరుణకుమారి, అధికారులు పాల్గొన్నారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో జరిగన కార్యక్రమంలో పలు కులసంఘాల నాయకుల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని