logo

ఎస్‌బీఐ బాండ్లు ఇప్పిస్తామని మోసం

ఎస్‌బీఐ బాండ్లు ఇప్పిస్తామని రూ.10 లక్షల మోసం చేసిన ఘటనపై నవాబుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published : 30 Mar 2023 03:46 IST

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే : ఎస్‌బీఐ బాండ్లు ఇప్పిస్తామని రూ.10 లక్షల మోసం చేసిన ఘటనపై నవాబుపేట పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. ఎన్‌సీ బాలయ్య నగర్‌లో విశ్రాంత అధ్యాపకులు జయరామయ్య నివాసముంటున్నారు. ఆయనకు దర్గామిట్ట బ్రాంచి  మేనేజరు వై.హనుమంతరావు పరిచయమయ్యారు. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్సులో నగదు జమ చేయాలని, దానికి బాండ్లు ఇస్తామని నమ్మబలికాడు. ఈ క్రమంలో విడతల వారీగా జయరామయ్య వద్ద రూ.10,90,875 వసూలు చేశాడు. నగదుకు సంబంధించి బాండ్లు అందజేయాలని కోరినా నకిలీ బాండ్లు అందజేశారు. దీనిపై మోసపోయినట్లు గుర్తించిన ఆయన.. నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని