logo

సబ్‌స్టేషన్లు తరచూ తనిఖీ చేయండి : ఎస్‌ఈ

జిల్లాలో విద్యుత్తు కనెక్షన్లను సకాలంలో అందించాలని విద్యుత్తుశాఖ పర్యవేక్షక ఇంజినీరు బి.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 03:46 IST

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : జిల్లాలో విద్యుత్తు కనెక్షన్లను సకాలంలో అందించాలని విద్యుత్తుశాఖ పర్యవేక్షక ఇంజినీరు బి.వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. బుధవారం నగరంలోని విద్యుత్తు భవన్‌లో ఆయన ఎగ్జిక్యూటివ్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, అకౌంట్స్‌ ఆఫీసర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. అన్ని సబ్‌స్టేషన్లను ఉన్నతాధికారులు తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలంటే తరచూ సబ్‌స్టేషన్స్‌ మెయింటినెన్స్‌ చేపట్టాలని కోరారు. జగనన్న కాలనీలు, వ్యవసాయ కనెక్షన్లు, గడపగడపకు కార్యక్రమంలో వస్తున్న అర్జీలు, విద్యుత్తు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. అవసరమున్న చోట ట్రాన్స్‌పార్మర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్తు సిబ్బంది జాగ్రత్తలు పాటిస్తూ పనలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ అకౌంట్స్‌ అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు. గురువారం శ్రీరామనవమి సెలవు దినమైనా కరెంటు బిల్లులు చెల్లించవచ్చని ఎస్‌ఈ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని