logo

Anam Ramanarayana Reddy: జిల్లాలో తెదేపా క్లీన్‌స్వీప్.. చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచైనా పోటీ: ఆనం

రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. తాను ఎంపీ స్థానానికి పోటీ చేయనన్నారు.

Updated : 23 May 2023 11:30 IST

స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆనం

వరికుంటపాడు, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. తాను ఎంపీ స్థానానికి పోటీ చేయనన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానన్నారు. మండల కేంద్రమైన వరికుంటపాడులో మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ అండ్రా నాగిరెడ్డి స్వగృహంలో సోమవారం మాట్లాడారు. జిల్లాలో అన్ని స్థానాలు తెదేపా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆఖరులో ముందస్తు ఎన్నికలు ఉండవచ్చన్నారు. ఎన్నికల ముందు 60 శాతం మంది తెదేపాలో చేరుతారన్నారు. అధికారం ఉన్నందున కొంతమంది వారి పనుల దృష్ట్యా తాత్కాలికంగా వైకాపాలో ఉంటున్నారని చెప్పారు. జిల్లాలో తెదేపా క్లీన్‌స్వీప్‌ చేస్తుందన్నారు. అనంతరం ఉదయగిరి నియోజక వర్గం పరిస్థితులపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అండ్రా నాగిరెడ్డితో తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో నాయకులు అండ్రా శివరామిరెడ్డి తదిరతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని