logo

ప్రభుత్వాలు మారినా ఎన్టీఆర్‌ సంస్కరణలు కొనసాగుతాయి

ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్టీఆర్‌ తెచ్చిన సంస్కరణలు కొనసాగుతాయని నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు.

Published : 29 May 2023 05:29 IST

నర్తకి కూడలిలో నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి రమేష్‌రెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్టీఆర్‌ తెచ్చిన సంస్కరణలు కొనసాగుతాయని నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు.నందమూరి తారక రామారావు యుగపురుషుడని, నిజమైన కథానాయకుడని కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నివాళులర్పించారు. నర్తకి కూడలి వద్ద మాజీ మంత్రి తాళ్ళపాక రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కోశారు. అనంతరం మాట్లాడుతూ మండుటెండను సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి మహానాడుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారని పేర్కొన్నారు. తెదేపాను ప్రోత్సహించేందుకు, పార్టీతో మమేకమయ్యేందుకు లక్షలాది మంది హాజరై విజయవంతం చేశారని తెలిపారు. వైకాపా దుర్మార్గ పాలనకు ప్రజలు ముగింపు కోరుకుంటున్నారని తెలిపారు. కష్టాల నుంచి బయటికి రావాలనుకుంటున్నారన్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు రద్దు చేయడం సరికాదన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి రమేష్‌రెడ్డి, తాళ్లపాక అనురాధ, పెంచలనాయుడు, పనబాక భూలక్ష్మి, నన్నే సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు