logo

అంగన్‌వాడీ కేంద్రాల్లో శుద్ధజలం

మాతా శిశు సంరక్షణలో కీలక సేవలందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ‘సాక్ష్యం’ పథకం కింద శుద్ధజలం సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు స్థానికంగా ఉండే బోర్లు, రక్షిత పథకాల నుంచి నీటిని తెచ్చి వినియోగిస్తున్నారు.

Published : 29 May 2023 05:29 IST

మినీ ఆర్వో ప్లాంట్లు మంజూరు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: మాతా శిశు సంరక్షణలో కీలక సేవలందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ‘సాక్ష్యం’ పథకం కింద శుద్ధజలం సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు స్థానికంగా ఉండే బోర్లు, రక్షిత పథకాల నుంచి నీటిని తెచ్చి వినియోగిస్తున్నారు. ఆ నీటినే బాలింతలు, చిన్నారులు, గర్భిణులకు ఇస్తున్నారు. చిన్నారులకు ఆటపాటలతో విద్య నేర్పుతూ.. పోషకాహారం అందిస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రయోజనకరం కానుంది. శాశ్వత భవనాలున్న వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వగా... విడతల వారీగా అన్నింటా ఏర్పాటు చేయనున్నారు.

జిల్లాలో 2,934 కేంద్రాలు.. జిల్లాలో 2,934 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా- 1008కి సొంత భవనాలు ఉన్నాయి. తొలిదశలో జూన్‌  నాటికి ఈ కేంద్రాలన్నింటిలో మినీ ఆర్వోప్లాంట్లు రానున్నాయి. అద్దె భవనాల్లో 1,147 ఉండగా- అద్దె లేకుండా 310, మిగిలినవి పాఠశాల ప్రాంగణాల్లో నడుస్తున్నాయి. దశల వారీగా వీటన్నింటిలో శుద్ధజల కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఒక్కో దానికి రూ. 24వేలు.. ఒక్కో శుద్ధజల కేంద్రంలో 15 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును అమర్చుతారు. గంటకు 12 లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. కేంద్రానికి నీటి సదుపాయం ఉంటే నేరుగా పైపులు ఏర్పాటు చేస్తారు. ఆ సదుపాయం లేని చోట్ల ప్రత్యామ్నాయాలు ఆలోచించనున్నారు. ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించనున్నట్లు సమాచారం.

400 ఏర్పాటుచేశాం

జిల్లాలో ఇప్పటి వరకు 400 అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్న శుద్ధజల కేంద్రాలను ఏర్పాటు చేశాం. విడతల వారీగా అన్నింటా ఈ సౌకర్యం కల్పిస్తాం.

సౌజన్య, ఐసీడీఎస్‌ పీడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని