logo

గాలివాన బీభత్సం

చేజర్ల మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. హోరుగాలులకు చెట్లు విరిగిపడి విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. మామిడి, నిమ్మ తోటలకు భారీ నష్టం వాటిల్లింది.

Published : 29 May 2023 05:29 IST

విరిగిపడిన చెట్లు

చేజర్ల, న్యూస్‌టుడే: చేజర్ల మండలంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. హోరుగాలులకు చెట్లు విరిగిపడి విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. మామిడి, నిమ్మ తోటలకు భారీ నష్టం వాటిల్లింది. పొదలకూరు-సోమశిల రహదారిపై చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు గ్రామాల్లోని వీధుల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లపై కూలాయి. వావిలేరు, ఆదూరుపల్లి, చిత్తలూరు, ఏటూరు, చేజర్ల నెన్నూరు, కొలపనాయుడుపల్లి, గొల్లపాడు, పెరమాళ్లపాడులో నష్టం వాటిల్లింది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు