అందని నిధులు.. సమకూరని వసతులు
ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణ, అభివృద్ధికి ఏర్పాటైన కమిటీలు నామమాత్రంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రోగులకు అవసరమైన వసతులు, మందులు, సేవల్లో అనేక లోపాలు కనిపిస్తున్నాయి.
నర్రవాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
న్యూస్‌టుడే, దుత్తలూరు:ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణ, అభివృద్ధికి ఏర్పాటైన కమిటీలు నామమాత్రంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో రోగులకు అవసరమైన వసతులు, మందులు, సేవల్లో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలకు తగినన్ని నిధులు అందకపోవటం ప్రధాన సమస్యగా మారింది. ఫలితంగా కమిటీల ఉద్దేశం నెరవేరటంలేదు.
* నిబంధనల మేరకు ఆసుపత్రి కమిటీలను రిజిస్టర్ చేయాల్సి ఉంది. అయినా ఎక్కడా ఈ తతంగం పూర్తి అవలేదు. దీనికితోడు ప్రభుత్వం ఏటా వైద్యశాలలకు విడుదల చేసే అభివృద్ధి నిధులకు భారీగా కోత పెట్టారు.గత ఏడాది వైద్యశాలల ఖాతాలకు జమ చేసిన నిధులనే ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఆపై ప్రభుత్వం ప్రతి పీహెచ్‌సీకి రూ. 25 వేలు వంతున చెల్లించి చేతులు దులుపుకుంది.
* దీనికితోడు గతంలో అత్యవసర మందులు కొనటానికి నెలకు ప్రతి పీహెచ్‌సీకి రూ. 3 వేలు మంజూరు చేసేవారు. గడిచిన మూడేళ్లుగా ఆ నిధులు కూడా విడుదలవటంలేదని వైద్య సిబ్బంది వాపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు, సామగ్రి కొనాలన్నా నిధులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తోంది.
* ప్రతి రెండు నెలలకొకసారి వైద్యశాలల అభివృద్ధి కమిటీలు తప్పనిసరిగా సమావేశమవ్వాలి. అనంతరం హాజరైనవారి వివరాలు, వైద్యశాలల ఆదాయవ్యయ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగటంలేదు. అసలు వైద్యశాలలకు అభివృద్ధి కమిటీలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* గతంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీల్లో డ్వాక్రా మహిళలు, విశ్రాంత ఉద్యోగులు సభ్యులుగా ఉండేవారు. కమిటీ ఛైర్మన్లను ప్రభుత్వం నియమించేది. ప్రస్తుత ప్రభుత్వం ఎంపీపీ ఛైర్మన్‌గా ఎంపీడీవో, తహసీల్దారు, వైద్యాధికారి, స్థానిక సర్పంచి, ఆసుపత్రి పరిధిలోని మరో మహిళా సర్పంచి సభ్యులుగా కమిటీల్లో నియమించింది.
* ఉదయగిరి నియోజకవర్గంలో రెండు సామాజిక, పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రతి వైద్యశాలకు ఒక కమిటీని నియమించి అభివృద్ధి నిధులు కేటాయించారు. ఆ నిధులను ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వేటికి ఖర్చు చేయాలనే అంశంపై చర్చించేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఏటా ఇచ్చే అభివృద్ధి నిధులు రూ. 1.75 లక్షల నుంచి రూ. 2.50 లక్షలకు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు (సీహెచ్‌సీలు) రూ. 5 లక్షలకు పెంచుతామని ప్రకటించింది. ఆచరణలో భిన్నమైన పరిస్థితి నెలకొంది.
తగిన చర్యలు తీసుకుంటాం
గతంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాలకు అభివృద్ధి కమిటీలను నియమించిన మాట వాస్తవమే. ప్రతి రెండు నెలలకొకసారి తప్పనిసరిగా కమిటీలు సమావేశమై తీర్మానాలు చేయాలి. ఇక నుంచి ప్రతి వైద్యశాలలో అభివృద్ధి కమిటీలు సమావేశమయ్యేలా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిధులతో అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తున్నాం.
పెంచలయ్య, జిల్లా వైద్యశాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు
-
Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
-
Chandrababu Arrest: ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది: రేవంత్రెడ్డి
-
Social Look: ఫ్యాషన్ షోలో ఖుషి.. దివి స్టైలిష్ అవతార్
-
Govt vs RBI: ఉర్జిత్పై మోదీ ఆగ్రహం.. పాముతో పోలిక: పుస్తకంలో సుభాష్ గార్గ్
-
Crime news: నగలు చోరీ చేసి దొంగల బీభత్సం.. బైక్పై వెళ్తూ గాల్లోకి కాల్పులు!