logo

దేశ ఐక్యత అందరి బాధ్యత

భారత రాజ్యాంగ స్ఫూర్తియైన ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం మనందరి ముందున్న కర్తవ్యమని ప్రముఖ న్యాయకోవిదులు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాలగౌడ అన్నారు.

Published : 29 May 2023 05:29 IST

మాట్లాడుతున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాల గౌడ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ స్ఫూర్తియైన ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం మనందరి ముందున్న కర్తవ్యమని ప్రముఖ న్యాయకోవిదులు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాలగౌడ అన్నారు. నెల్లూరులోని రాజేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం డాక్టర్‌ విజయకుమార్‌ 8వ వర్ధంతి సందర్భంగా  డాక్టర్‌ జీవీకె మెమోరియల్‌ ట్రస్ట్‌ సభ్యులు అబ్బాయిరెడ్డి అధ్యక్షతన ‘భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ- ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సమావేశం జరిగింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ మాట్లాడుతూ ప్రస్తుతం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని చెప్పారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. ప్రతి ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉండాలన్నారు. ఎన్నో మతాలు, కులాలతో కూడిన దేశమని, రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందని వివరించారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసతేజ, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ మాదాల వెంకటేశ్వర్లు, కార్మికోద్యమ నాయకులు దామా అంకయ్య, ట్రస్ట్‌ ఛైర్మన్‌ జయలక్ష్మి, వివిధ సంఘాల నాయకులు గోపాల్‌, ఎల్లంకి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని