చకచకా ఓడరేవు పనులు
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల తీరుతోంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు పునరావాస కాలనీలు వేగంగా నిర్మాణం చేస్తున్నారు.
మొండివారిపాలెం వద్ద పనుల పరిస్థితి
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల తీరుతోంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు పునరావాస కాలనీలు వేగంగా నిర్మాణం చేస్తున్నారు.
కందుకూరు, గుడ్లూరు, న్యూస్‌టుడే: జిల్లాలోని గుడ్లూరు మండలం రామాయపట్నం సమీపంలోని కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం పరిధిలో ఓడరేవు నిర్మాణానికి గత సంవత్సరం జూలై 20న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ నిర్వహించారు. సుమారు 832 ఎకరాల్లో నాన్ మేజర్ ఓడరేవు పనులు ప్రారంభించారు. అప్పటినుంచి పనులు నిరాఘాటంగా సాగుతున్నాయి. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మొండివారిపాలెం, ఆవులవారిపాలెం వద్ద బ్రేక్‌వాటర్ పనులు వేగంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సముద్రంలో రెండు నుంచి మూడు కి.మీ పొడవునా మార్గాన్ని ఏర్పాటుచేస్తున్నారు. నెల రోజుల నుంచి సముద్రపు లోతు పెంచేందుకు ఇసుకను తోడేందుకు పెద్ద పడవలను ఉపయోగిస్తున్నారు. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం గ్రామాలకు చెందిన సుమారు 250 మందికి పునరావాసం కల్పించేందుకు రామాయపట్నం- తెట్టు మధ్యలో 25 ఎకరాలు కేటాయించారు. మొండివారిపాలెం వాసులు ఇప్పటికే సగానికి పైగా ఇళ్లు నిర్మించుకోగా, ఆవులవారిపాలెం వాసుల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. పునరావాస కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్తు సౌకర్యాలు కల్పించడంతో లబ్ధిదారులు తమ ఇళ్లను ఎటువంటి ఆటంకం లేకుండా నిర్మించుకుంటున్నారు.
* ఓడరేవును ప్రధాన రైలు మార్గంతో అనుసంధానిస్తూ రైల్వే లైను నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేశారు. కొందరికి పునరావాసం చూపించాల్సి ఉంది. కర్లపాలెం వాసులకు పునరావాస స్థలాలను చూడాల్సి ఉంది.
డిసెంబరు నాటికి.. : వచ్చే డిసెంబరు నాటికి ఓడరేవులో మొదటి పెద్దపడవ వచ్చే విధంగా పనులు చేస్తున్నారు. 24 గంటలూ పనులు జరుగుతుండడంతో ఆ పరిధిలోని గ్రామాలైన రావూరు, చేవూరులో సందడి వాతావరణం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Weather Report: తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు
-
Military Tank: సైనిక శిక్షణ కేంద్రంలో మాయమై.. తుక్కులో తేలి!
-
Chandrayaan 3: జాబిల్లిపై సూర్యోదయం.. విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు ఇస్రో ప్రయత్నాలు
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Manipur: మణిపుర్లో మరోసారి ఉద్రిక్తతలు.. కర్ఫ్యూ సడలింపులు రద్దు!
-
JDS: భాజపా నేతలతో దేవెగౌడ కీలక భేటీ.. ఎన్డీయేలో జేడీఎస్ చేరికకు రంగం సిద్ధం?