logo

ఎంపీడీవోలుగా పదోన్నతి

జడ్పీ కార్యాలయంలో సీనియర్‌ పరిపాలనాధికారులుగా పనిచేస్తున్న సెలెట్‌, ప్రసన్నకుమారిలతో పాటు మండల విస్తరణాధికారి వసుంధరాదేవికి ఎంపీడీవోలుగా పదోన్నతి లభించగా వీరిని తిరుపతి జిల్లాకు కేటాయించారు.

Published : 29 May 2023 05:39 IST

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: జడ్పీ కార్యాలయంలో సీనియర్‌ పరిపాలనాధికారులుగా పనిచేస్తున్న సెలెట్‌, ప్రసన్నకుమారిలతో పాటు మండల విస్తరణాధికారి వసుంధరాదేవికి ఎంపీడీవోలుగా పదోన్నతి లభించగా వీరిని తిరుపతి జిల్లాకు కేటాయించారు. తిరుపతి జిల్లాలో ఈవోపీఆర్డీగా పనిచేస్తున్న శ్రీనివాసరావును నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. పంచాయతీరాజ్‌ ఉద్యోగ సంఘం చేసిన ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పరిపాలనాధికారులుగా పని చేస్తున్న వారికి ఎంపీడీవోలుగా పదోన్నతులు కల్పించడంపై జడ్పీ ఉద్యోగ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌.పెంచలయ్య, రమేష్‌లు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు