logo

కదిలిన మానవత్వం

‘దిక్కులేని చుక్కలు’ శీర్షికతో బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, దాతలు స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

Updated : 01 Jun 2023 05:36 IST

చిన్నారుల నాయనమ్మతో మాట్లాడుతున్న అధికారులు

అనంతసాగరం, న్యూస్‌టుడే: ‘దిక్కులేని చుక్కలు’ శీర్షికతో బుధవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, దాతలు స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మండలంలోని మినగల్లులో ఐసీడీఎస్‌ సీడీపీవో పద్మావతి, జిల్లా శిశు సంక్షేమ అధికారులు సబిత, పావని తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను పోషిస్తున్న నాయనమ్మ వద్దకు వెళ్లి విచారించారు. సీడీపీవో మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వమే చేరదీసి వారి బాగోగులు చూసుకుంటుందన్నారు. లేదా పిల్లలు మీ సంరక్షణలోనే ఉంటే కేంద్ర ప్రభుత్వం అందించే పలు పథకాల గురించి నాయనమ్మకు వివరించారు. వారం రోజుల తరువాత వాళ్ల నిర్ణయం ప్రకారం చిన్నారులను ఎలా ఆదుకోవాలో తెలియజేస్తామన్నారు. మరోవైపు ఇద్దరు దాతలు చిన్నారుల కోసం చరవాణి ద్వారా స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త భారతిని సంప్రదించారు. చిన్నారుల పెద్దలు అంగీకరిస్తే దత్తత తీసుకుంటామని ముందుకొచ్చారు. అధికారులు, దాతల స్పందనపై చిన్నారుల నాయనమ్మ, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని