logo

పథకాల సద్వినియోగంతో అభివృద్ధి: కలెక్టర్‌

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు.

Updated : 02 Jun 2023 06:08 IST

నమునా చెక్కును రైతులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. రైతు భరోసా ఐదో విడత నిధులు, పంట నష్ట పరిహారం విడుదల నమూనా చెక్కులను నగరంలోని ముత్తుకూరు రోడ్డు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో గురువారం కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఏఆర్‌ఎస్‌ ప్రాంగణంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లు, చిరుధాన్యాలు, వైఎస్సార్‌ యంత్ర సేవ, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 2,14,636 మంది రైతులకు తొలివిడత రైతు భరోసా- పీఎం కిసాన్‌ నగదు రూ.118 కోట్లు, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 1579 మంది రైతులకు పరిహారం రూ.1.85 కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌రాజు, ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, శిక్షణ కలెక్టర్‌ సంజనా సింహ, వ్యవసాయ శాఖ డీడీ శివన్నారాయణ, ఏడీలు అనిత, నర్సోజీరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

వసతి గృహాల్లో ఎక్కువ మంది చేరేలా చర్యలు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో సాంఘిక సంక్షేమ శాఖలో అమలవుతున్న పథకాలు, వసతి గృహాల పనితీరు, వసతులు, తాగునీరు, పరీక్షల ఫలితాలు తదితర విషయాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు.  సమావేశంలో శిక్షణ కలెక్టర్‌ సంజన సిన్హా, జిల్లాలోని సహాయ సాంఘిక సంక్షేమాధికారులు పాల్గొన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందించడమే లక్ష్యంగా అయిదు రకాల గుర్తింపు కార్డులు అందించాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆధార్‌, రేషన్‌, ఓటరు, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలన్నారు. సమావేశంలో ప్రాజెక్టు అధికారి మందా రాణి, ఈఈ వసంత, ఐటీడీఏ అధికారులు పరిమళ, శ్రీనివాసులు, కలీం తదితరులు పాల్గొన్నారు.  జాతీయ రహదారులకు భూసేకరణ వేగవంతం చేస్తూ రైతులకు పరిహారం అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి వివరించారు. అమరావతి నుంచి భూహక్కు పత్రాల పంపిణీ, విద్యుత్తు, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణ లబ్ధిదారులకు రుణాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, జలజీవన్‌ మిషన్‌ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, జేసీ రోణంకి కూర్మనాథ్‌, నగరపాలకసంస్థ కమిషనర్‌ వికాస్‌మర్మత్‌, శిక్షణ కలెక్టర్లు విద్యాధరి, సంజన సిన్హా జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని