logo

కంటైనర్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

ఆగి ఉన్న కంటైనర్‌ వెనుక వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర, ఐదు గురికి స్వల్పగాయాలైన సంఘటన కొడవలూరు మండలంలోని జాతీయరహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 03 Jun 2023 02:08 IST

ఇద్దరికి తీవ్ర..ఐదుగురికి స్వల్పగాయాలు

కొడవలూరు, న్యూస్‌టుడే: ఆగి ఉన్న కంటైనర్‌ వెనుక వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర, ఐదు గురికి స్వల్పగాయాలైన సంఘటన కొడవలూరు మండలంలోని జాతీయరహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. గొర్రెలను మేపుతూ సంచారజీవనం చేస్తున్న వారు గురువారం రాత్రి జాతీయ రహదారి పక్కనే కొడవలూరు మండలంలోని నాయుడుపాళెం వద్ద ఖాళీస్థలంలో తోలి అక్కడే నిద్రించారు. శుక్రవారం వేకువజామున గొర్రెలు రోడ్డుపైకి వచ్చాయి. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఏడు గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. వాటిని కాపరి తొలగిస్తుండగా కావలి వైపు నుంచి వస్తున్న కంటైనర్‌ డ్రైవర్‌ గొర్రెలను చూసి సడన్‌ బ్రేక్‌ వేశాడు. వెనుక వస్తున్న విశాఖపట్నం- బెంగళూరు ట్రావెల్స్‌ బస్సు వేగం అదుపుకాక రోడ్డుపై ఉన్న కంటైనర్‌ను వేగంగా ఢీకొనడంతో ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. వీరంతా కాకినాడ, విశాఖ పట్నం సమీప ప్రాంతాలకు చెందిన వారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో కొడవలూరు ఎస్సై జి.సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో తీవ్రగాయాలైన వారిని బయటకు తీశారు. 108 ద్వారా నెల్లూరు నగరంలోని వైద్యశాలకు తరలించారు. వీరిలో మంజు శిరీష, దుర్గాప్రసాద్‌కు తీవ్రగాయాలవగా మిగిలిన ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. సీఐ రామారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని