logo

ఠారెత్తిస్తున్న ఎండలు

తీవ్రమైన ఎండలు జిల్లా వాసులను ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 30 నుంచి 31 డిగ్రీలు నమోదవుతుండటంతో రాత్రిళ్లూ వాతావరణం చల్లబడటం లేదు.

Published : 04 Jun 2023 02:56 IST

38 మండలాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదు

ఎండ తాకిడికి బోసిపోయిన వేదాయపాళెం రోడ్డు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు:  తీవ్రమైన ఎండలు జిల్లా వాసులను ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 30 నుంచి 31 డిగ్రీలు నమోదవుతుండటంతో రాత్రిళ్లూ వాతావరణం చల్లబడటం లేదు. సాయంత్రం ఆరు గంటల సమయంలోనూ చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది. శనివారం జిల్లాలోని 38 మండలాల్లో.. 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా రాపూరు మండలం వేపినాపి అక్కమాంబపురంలో అత్యధికంగా 43.8 డిగ్రీలు నమోదైంది. కలిగిరిలో 42.6, మనుబోలు మండలం కట్టువపల్లెలో 42.5, జలదంకి 42.2, వెంకటాచలం మండలం కసుమూరులో 42, బ్రహ్మదేవిలో 42 డిగ్రీలుగా ఉంది. అత్యల్పంగా అల్లూరు మండలంలో 40 డిగ్రీలుంది. దీంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. అధిక లోడుతో విద్యుత్తు నియంత్రికలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ప్రారంభం కావడంతో పాటు.. వడగాడ్పులు ఉండటంతో పిల్లలు,మహిళలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిర్జలీకరణ(డిహైడ్రేషన్‌)తో ఆసుపత్రులకు వెళుతున్న చిన్నారుల సంఖ్య పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని