logo

బిట్రగుంటలో నోస్‌ మార్పు

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటన నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. సమష్టిగా రైలు మార్గాన్ని తనిఖీ చేస్తున్నారు. చిన్నపాటి లోపాలను చక్కదిద్దుతున్నారు.

Published : 07 Jun 2023 04:33 IST

క్రాస్‌ంగ్‌ పాయింట్ మధ్య మార్చిన నోస్‌ పైభాగం

బిట్రగుంట, న్యూస్‌టుడే: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటన నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. సమష్టిగా రైలు మార్గాన్ని తనిఖీ చేస్తున్నారు. చిన్నపాటి లోపాలను చక్కదిద్దుతున్నారు. మంగళవారం బిట్రగుంట రైల్వేస్టేషన్‌ దక్షిణ యార్డులో 144-143 లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద ఎగువ, దిగువ మార్గాలను కలిపే క్రాసింగ్‌ పాయింట్ వద్ద కీలకమైన ‘నోస్‌’ పైభాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ప్రమాదాలకు అవకాశం లేకపోయినా ముందస్తుగానే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. రైలు రహదారి, సిగ్నలింగ్‌ వ్యవస్థకు చెందిన అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. ఉదయం రైలు పరుగులేని సమయంలో లైన్‌ బ్లాక్‌ తీసుకుని గంటన్నర వ్యవధిలోనే దెబ్బతిన్న ‘నోస్‌’ను క్రాసింగ్‌ పాయింట్ స్థానే కొత్తది అమర్చారు. ఇరువైపులా 20 మీటర్ల మేర కొత్త పట్టాల మార్పిడి కూడా యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని