logo

పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం స్పందించింది

ఏపీజేఏసీ అమరావతి చేపట్టిన సుదీర్ఘ పోరాటాలతో ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల కోర్కెలు తీర్చేందుకు అంగీకరించిందని ఆ సంఘ నాయకులు వెల్లడించారు.

Published : 07 Jun 2023 04:33 IST

సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: ఏపీజేఏసీ అమరావతి చేపట్టిన సుదీర్ఘ పోరాటాలతో ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల కోర్కెలు తీర్చేందుకు అంగీకరించిందని ఆ సంఘ నాయకులు వెల్లడించారు. నెల్లూరులో మంగళవారం సమావేశమైన ఆ సంఘ నాయకులు.. ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లను వివరించారు. గత 90రోజులుగా పోరాటానికి సహకరించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ నాయకులు ఎ.పెంచలరెడ్డి, ప్రసాద్‌, బి.మురళి, శరత్‌బాబు, బాబురావు, అల్లం సురేశ్‌ పాల్గొన్నారు.

ఏపీజీఈఎఫ్‌ హర్షం

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను అంగీకరిస్తూ తీసుకున్న నిర్ణయంపై మంగళవారం నగరంలోని సంతపేటలో ఓ భవనంలో ఏపీజీఈఎఫ్‌ ఉమ్మడి జిల్లా నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘ జిల్లా ఛైర్మన్‌ సుధాకర్‌ మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని