logo

రూ. లక్షల పనుల్లో నిబంధనలకు నీళ్లు

పట్టణంలోని ప్రధాన ప్రాంతమైన బాలకృష్ణారెడ్డినగర్‌లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ప్రజల విజ్ఞప్తుల మేరకు ఎంపీ ద్వారా ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి రూ.70 లక్షలు మంజూరు చేయించారు.

Published : 09 Jun 2023 02:15 IST

న్యూస్‌టుడే, కావలి

పట్టణంలోని ప్రధాన ప్రాంతమైన బాలకృష్ణారెడ్డినగర్‌లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ప్రజల విజ్ఞప్తుల మేరకు ఎంపీ ద్వారా ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి రూ.70 లక్షలు మంజూరు చేయించారు.  ఈ నిధులతో 2.7 కిలోమీటర్ల మేరకు మురుగుకాలువలు, కల్వర్టులతోపాటు కొంతమేర గ్రావెల్‌ రహదారులను సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు నిర్మించాల్సి ఉంది.  రెండు నెలల క్రితం శ్రీకారం చుట్టారు. ఈపనుల్లో గుత్తేదారులు నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులను ప్రసన్నం చేసుకొని ఇష్టారీతిగా చేస్తున్నారు. మురుగుకాలువలు, కల్వర్టులు, రహదారులను అడ్డగోలుగా నిర్మిస్తున్నారు. కాలువలకు పూత పనులు చేయలేదు. రహదారికి చెత్తతో కూడిన మట్టి పోశారు. కల్వర్టులను వారిష్టం ప్రకారం నిర్మించారు. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో రూ.లక్షలాది నిధులు దుర్వినియోగమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

నలభై అయిదు రోజులకు పైగా బాలకృష్ణారెడ్డినగర్‌లో రహదారి పనులు నిలిపివేశారు. రోలింగ్‌ సజావుగా చేయలేదు. దీనిపైనే వాహనదారులు ఇక్కట్లు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. అందకు ముందు వర్షం వచ్చిన కొద్దిరోజులు మాత్రమే ఇబ్బంది పడుతుండేవారు. ప్రస్తుతం నిత్యం నరకాన్ని చవిచూస్తున్నారు.

ఇది పట్టణంలోని బాలకృష్ణారెడ్డినగర్‌లో రహదారికి నిర్మాణానికి ట్రాక్టర్‌లో తరలిస్తున్న చెత్తతో కూడిన మట్టి. దీనిపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. పైపొరగా కొద్దిగా మేలి రకం గ్రావెల్‌ పోసి సరిపెడుతున్నారు. మిగతాదంతా ఇదే పోస్తున్నారు.

ఇది రహదారికి అనుసంధానం చేయని కల్వర్టు. దీంతో బాలకృష్ణారెడ్డినగర్‌వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 50 రోజుల క్రితమే నిర్మాణం పూర్తయింది. అప్రోచ్‌ పూర్తి చేయకుండా వదిలేసిన కల్వర్టులను దాటి వెళ్లలేక వాహనదారులు కష్టాలు పడుతున్నారు. చుట్టూ తిరిగి మరో దారిలో నివాసాలకు వెళుతున్నారు.

పరిశీలిస్తాం..:

విజయలక్ష్మి, ఉపఇంజినీరు, ప్రజారోగ్య శాఖ

వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండడంతో పనుల పర్యవేక్షణకు ఇటీవల వెళ్లలేదు. మా సహాయ ఇంజినీరుకు చెప్పి నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్లుగా చేసేలా చూస్తాం. నాసిరకంగా పనులు జరిగితే సహించబోం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని