logo

దశాబ్దాల బడి.. మూతపడి

ఎందరినో మేధావులుగా తీర్చిదిద్దిన దశాబ్దాల నాటి బడి మూతపడింది. ప్రభుత్వం తీరుతోనే నడపలేకపోతున్నామని పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు.

Published : 09 Jun 2023 02:15 IST

న్యూస్‌టుడే, బిట్రగుంట

మూసివేసిన ఆర్సీఎం ఉన్నత పాఠశాల

ఎందరినో మేధావులుగా తీర్చిదిద్దిన దశాబ్దాల నాటి బడి మూతపడింది. ప్రభుత్వం తీరుతోనే నడపలేకపోతున్నామని పాఠశాల నిర్వాహకులు చెబుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండి సౌకర్యాలు ఉన్న బడి మూతపడడం ఎంతోమంది పేద విద్యార్థులకు శాపంగా మారింది. మండల కేంద్రమైన బోగోలులోని రోమన్‌ కేథలిక్‌ మిషనరీ (ఆర్సీఎం) ఉన్నత పాఠశాల 1953లో ఏర్పాటైంది. వెనుకపడిన ఈ ప్రాంతంలో పేద విద్యార్థులకు విద్య అందించాలని రోమన్‌ కేథలిక్‌ మిషనరీ సంస్థ ప్రథమంగా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించింది. 13 ఎకరాల విస్తీర్ణంలో నూతన భవనాలు, వసతులు సమకూర్చుకుంది. విశాలమైన క్రీడా మైదానం కూడా ఉంది. చదువులు బాగుండడంతో తల్లిదండ్రులు పిల్లలను చేర్పిస్తుండడంతో సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో 1982లో ప్రాథమికోన్నత పాఠశాలగా ఎదిగింది. 1000 మందికి పైగా చేరుకోవడంతో 1993లో ఉన్నత పాఠశాలగా రూపుదిద్దుకుంది. చుట్టుపక్కల స్కూళ్ల సంఖ్య పెరిగినా ఆంగ్ల మాధ్యమంపై అందరి దృష్టి మళ్లినా 700 మంది విద్యార్థుల వరకు ఇక్కడ చదువుకునే వారు.

ప్రోత్సాహం కొరవడి..

ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గింది. ఈ క్రమంలోనే పాఠశాలను నడపడం సంస్థకు భారమైంది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్త వారిని నియమించే పరిస్థితి లేదు. చివరికి ఒక్క ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ప్రభుత్వ జీతంతో పనిచేస్తున్నారు. మిగిలిన బోధన, బోధనేతర ఉద్యోగులు 10 మందికి రోమన్‌ కేథలిక్‌ మిషనరీ సంస్థ జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 40 వరకు ఉన్నాయి (ఆర్సీఎం సంస్థవి). ఇవన్నీ ఈ ఏడాదే మూత పడే పరిస్థితి ఉందన్న సమాచారం. దీన్ని మూసివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలను ఎక్కడ చేర్చాలో తెలియని పరిస్థితి నెలకొంది. పాలకులు ఈబడి మూతపడకుండా తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఇతర పాఠశాలల్లో చేర్పిస్తున్నాం

జయంత్‌బాబు, ఎంఈవో

ప్రాథమిక విద్యార్థులను బోగోలు ప్రధాన పాఠశాలలో చేర్పిస్తున్నాం. మిగిలిన వారిని విశ్వనాథరావుపేట ఉన్నత పాఠశాలలో చేరేలా అవకాశం కల్పిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని