logo

జీజీహెచ్‌కు రూ.95 లక్షలు మంజూరు

జిల్లా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, నిర్వహణకు రూ.95 లక్షలు విడుదల చేస్తూ డీఎంఈ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 09 Jun 2023 02:15 IST

కలెక్టరు హరినారాయణన్‌

నెల్లూరు(జీజీహెచ్‌), న్యూస్‌టుడే: జిల్లా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, నిర్వహణకు రూ.95 లక్షలు విడుదల చేస్తూ డీఎంఈ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రిలో లిఫ్టులు, ఏసీలు, రక్త పరీక్షల మెరుగుదల, ఇతర పెండింగ్‌లో ఉన్న మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన నివేదికను ఇటీవల కలెక్టరు హరినారాయణన్‌ డీఎంఈకి పంపారు. ఈ నేపథ్యంలో రూ.95 లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

లిఫ్టులు, ఏసీల మరమ్మతుకు ఆదేశాలు.. కలెక్టరేట్‌ (నెల్లూరు) : నెల్లూరు జీజీహెచ్‌లో లిఫ్టులు, ఏసీలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని, నిర్వహణ కోసం టెండర్లు పిలవాలని కలెక్టర్‌ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమీక్షించారు. రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పొక్లెయిన్‌తో పరిసరాలు శుభ్రం చేయించాలని ఆదేశించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సిద్ధానాయక్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ కె.ఉమాశంకర్‌, డీఈ సాంబశివరావు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన ప్రభుత్వ వైద్యశాలల్లో అందుతున్న సేవలపై సమీక్షించి.. వైద్యులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని