logo

రాపూరు ఎంపీపీ ఎన్నిక నేటికి వాయిదా

రాపూరులో గురువారం జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక 9వ తేదీకి వాయిదా పడింది. ఆనం రామనారాయణరెడ్డి, నేదురుమల్లి రామకుమార్‌రెడ్డి వర్గాల్లోని 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఎవరూ మండల పరిషత్తు కార్యాలయానికి రాకపోవడంతో ప్రక్రియను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి తిరుపతయ్య తెలిపారు.

Published : 09 Jun 2023 02:15 IST

కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు

రాపూరు, న్యూస్‌టుడే: రాపూరులో గురువారం జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక 9వ తేదీకి వాయిదా పడింది. ఆనం రామనారాయణరెడ్డి, నేదురుమల్లి రామకుమార్‌రెడ్డి వర్గాల్లోని 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఎవరూ మండల పరిషత్తు కార్యాలయానికి రాకపోవడంతో ప్రక్రియను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి తిరుపతయ్య తెలిపారు. ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌, పెంచలకోన ఆలయ ఛైర్మన్‌ చెన్ను తిరిపాల్‌రెడ్డి ముందుగానే మండల పరిషత్తు కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నిరీక్షించారు. ఎంపీటీసీ సభ్యులు ఎవరూ రాకపోవడంతో.. వారు కూడా వెనుదిరిగారు.

144 సెక్షన్‌ విధింపు.. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రాపూరులో 144 సెక్షన్‌ విధించారు. సీఐ కోటేశ్వరరావు నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు