logo
Published : 27/11/2021 03:35 IST

ఆవేదన

అమాంతం పెరిగిన పొద్దుతిరుగుడు విత్తనం ధర

న్యూస్‌టుడే, నందిపేట్‌ గ్రామీణం

సర్కారు వరికి ప్రత్యామ్నాయంగా వేయమని చెప్పిన పంటల్లో పొద్దుతిరుగుడే ప్రధానంగా ఉంది. జిల్లాలో గింజ విత్తనం దొరకని పరిస్థితి ఏర్పడింది. ముందుగానే ఏర్పడిన కొరతను కంపెనీలు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా రెండింతలు ధర పెట్టినా దొరికే పరిస్థితి లేదు. జిల్లా కేంద్రంతో పాటు, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌, బాల్కొండ డివిజన్లలో ఈ విత్తనానికి భారీగా డిమాండ్‌ ఉంది. విత్తన కొరతతో జిల్లాలో కనీసం వంద ఎకరాలు వేసే అవకాశం లేకుండా పోతోంది. ఎకరాకు రెండు కిలోల విత్తనం అవసరముంటుంది. బస్తా ధర సాధారణంగా రూ.1500లకు కాస్త ఇటూఇటుగా ఉంటుంది. బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా ఇప్పుడు రూ.3,200 నుంచి రూ.4,500 వరకు పలుకుతోంది. కొనేందుకు రైతులు సాహసం చేయకపోవడంతో బిచ్కుంద, పిట్లం, మద్నూర్‌, జహీరాబాద్‌, భైంసా, మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బిల్లులు లేకుండానే కొంటున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని