logo
Published : 27/11/2021 03:35 IST

ఆనందం

రూ. 7 వేల మార్కు దాటిన పసుపు ధర

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

పసుపు ధరలో మార్పు వస్తోంది. ఆరు నెలలుగా రూ.6 వేలుగా ఉన్న సగటు ధర ప్రస్తుతం క్వింటాలుకు రూ.7 వేల మార్కును దాటింది. మూడు రోజులుగా నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధరలో ఎదుగుదల కనిపిస్తోంది. దేశంలోనే అత్యధిక సాగు విస్తీర్ణం గల ప్రాంతంగా పేరున్న ఆర్మూర్‌లో ఈ ఏడాది 36 వేల ఎకరాలకు పైగా సాగు చేశారు. జిల్లాను ఆనుకొని ఉన్న జగిత్యాల, నిర్మల్‌ వారూ సాగు చేస్తారు. వీరంతా ఎక్కువ భాగం నిజామాబాద్‌ యార్డుకే పంట తీసుకొస్తారు. గతేడాది మొదట్లో సగటున రూ. 7,600 వరకు పలికిన ధర క్రమేణా తగ్గుతూ రూ. 5,500 కనిష్ఠానికి చేరింది. అన్‌ సీజన్‌లోనూ యార్డుకు నిత్యం 500-1000 క్వింటాళ్ల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధర పెరగడంపై పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో కొత్త పంట చేతికి రానుంది. అప్పటివరకు పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని రైతులు భరోసాతో ఉన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని