logo
Published : 27/11/2021 03:35 IST

నేడు వర్సిటీ పాలకమండలి సమావేశం

వాయిదా అంశాలపై చర్చ

ఈనాడు, నిజామాబాద్‌

తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం శనివారం హైదరాబాద్‌లోని రూసా భవన్‌లో జరగనుంది. గత నెల 30న నిర్వహించిన సమావేశంలో వాయిదా వేసిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా 2014 అధ్యాపకుల పదోన్నతులు, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న వేతన సవరణ వర్తింపు ఇందులో ఉన్నాయి.

* సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు బోధించే అకడమిక్‌ కన్సల్టెంట్లు, బోధన, శాశ్వత, తాత్కాలిక బోధనేతర సిబ్బందికి వేతన సవరణ అమలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి 141, 63 జీవోలను అనుసరించి ప్రయోజనాలు వర్తింపజేయాలి. అయితే వీటిపై ఇంకా ముందడుగు పడలేదు. ఆర్థికపరమైన అంశాలు కావడంతో పాటు వర్సిటీ పెద్దలు ఈ దస్త్రంపై సంతకాలు చేయలేదని తెలుస్తోంది. అక్రమ నియామకాలు, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన పదోన్నతుల రద్దుకు నిర్ణయించారు. అదనంగా వేతనాలు చెల్లించి ఉంటే రికవరీ చేయాలన్న విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది.

సమస్యపై నాన్చుడు..

విశ్వవిద్యాలయంలో 2014లో జరిగిన నియామకాల అంశం వివాదాస్పదమైంది. వీరిలో కొందరు అసిస్టెంట్లు, మరికొందరు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ఉన్నారు. తమ సర్వీసు ఆధారంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు, పదోన్నతులు రావడం లేదంటూ 48 మంది కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో విశ్వవిద్యాలయం ఎలా ముందుకెళ్లాలో కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ అధికారులు నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు. గత పాలకమండలి సమావేశంలో ఈ అంశం ఉన్నా కోర్టు తీర్పు, ఇతర వర్సిటీల్లో జరిగిన విధానాన్ని పరిశీలించి శనివారం జరిగే సమావేశంలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.

సమన్వయం కుదిరితేనే ముందడుగు

గతంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో ఆలస్యంతో పాటు వర్సిటీ అభివృద్ధికి దోహదం చేసే విషయాలపై అధికారుల మధ్య సమన్వయం లోపించిందనే చర్చ సాగుతోంది. తాజాగా ముగ్గురు ఉద్యోగుల సర్వీసు రికార్డులు బయటికెళ్లిన వివాదంపై ఉద్యోగులు కొన్ని రోజుల కిందట ఉపకులపతిని కలిశారు. పూర్వ రిజిస్ట్రార్‌ను వివరణ కోరుతానని ఆయన వారికి సమాధానమిచ్చారు. రెండు రోజుల క్రితం వారు మరోసారి కలవగా పాలకమండలి సభ్యుల అభిప్రాయం కూడా తీసుకుందామని చెప్పినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల నుంచి మార్పు రావాలంటే విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని