logo
Updated : 27/11/2021 05:53 IST

రెండోసారి మండలికి కవిత

ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రం అందజేత


ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు కవితకు ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్ఢి

చిత్రంలో ఎన్నికల పరిశీలకురాలు అనితా రాజేంద్ర, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ ఉన్నారు.

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: శాసనమండలికి కల్వకుంట్ల కవిత రెండోసారి వెళ్లనున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం మధ్యాహ్నంతో ముగిసింది. తెరాస అభ్యర్థిగా కవిత ఒక్కరే బరిలో ఉండడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల పరిశీలకురాలు అనిత రాజేంద్ర సమక్షంలో రిటర్నింగ్‌ అధికారి, జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టరేట్‌లో అందజేశారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కవిత మొదటిసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నిక నిర్వహించారు. కలెక్టరేట్‌కు వచ్చిన వారిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, జడ్పీ ఛైర్మన్లు విఠల్‌రావు, శోభ, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, హన్మంత్‌షిండే, ఎమ్మెల్సీలు వీజీగౌడ్‌, రాజేశ్వర్‌, మేయర్‌ నీతూకిరణ్‌, ఐడీసీఎంఎస్‌ ఛైర్మన్‌ మోహన్‌, రెడ్‌-కో ఛైర్మన్‌ అలీం, నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో కవిత నివాసం, క్యాంప్‌ కార్యాలయం వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేశారు. తెలంగాణ జాగృతి మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు.


ముఖ్యపాత్ర పోషిస్తారు: మంత్రి

ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ముఖ్యమైంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో తెరాసకు భారీ మెజార్టీ ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించారు.


అందరి సహకారంతో అభివృద్ధి చేస్తా: కవిత

సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తన ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు సహకరించారు. రెండోసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ప్రజాప్రతినిధుల సహకారంతో ఉభయ జిల్లాల అభివ్దృద్ధికి కృషి చేస్తాను.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని