logo
Updated : 27/11/2021 04:33 IST

నగదు ఇబ్బందులకు చెల్లుంపులు

ఉపాధి కూలీల ఖాతాల్లోకే నేరుగా..

న్యూస్‌టుడే, కామారెడ్డి సంక్షేమం


పొందుర్తిలో బ్యాంకు ఖాతా, ఆధార్‌ జిరాక్సుల కోసం ఓ దుకాణంలో నిలబడిన వ్యక్తులు

ఉపాధి కూలీ డబ్బులు ఇకపై బ్యాంకు ఖాతాల ద్వారా అందనున్నాయి. తపాలశాఖకు అప్పగించిన బాధ్యతలు తొలగించనున్నారు. ఈ మేరకు ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ కార్డు నంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2.62 లక్షల జాబ్‌కార్డులు ఉండగా ఇప్పటికే 90శాతానికి పైగా కూలీల వివరాలను సేకరించారు. నాలుగైదు రోజుల్లో మొత్తం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

అక్రమాలకు చెక్‌..

ఇప్పటి వరకు కూలీలు స్థానిక తపాలశాఖ కేంద్రాల నుంచి నగదు పంపిణీ చేస్తూ వస్తున్నారు. వేలిముద్రలు సరిపోల్చుకుని చెల్లింపు చేస్తున్నారు. కూలీలకు తెలియకుండా డబ్బులు కాజేసిన ఘటనలు జిల్లావ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. కూలీలతో వేలిముద్రలు పెట్టించుకుని నగదు మరుసటి రోజు ఇస్తామని ఉడాయించిన వారిపై కేసులూ నమోదయ్యాయి. నిరక్షరాస్యులైన కూలీలకు లెక్క తప్పు చెప్పి కొంత నొకేస్తున్న వారున్నారు. ఇలాంటి అక్రమాలు నిరోధించడానికి బ్యాంకు ఖాతా విధానం ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే డబ్బులు డ్రా చేయడానికి పల్లెల్లో బ్యాంకులు అందుబాటులో లేవు. పట్టణాలకులేదా సమీపంలో ఏటీఎంకు వెళ్లాల్సి ఉంటుంది.

అవసరమైనప్పుడు తీసుకోవచ్చు

ఉపాధి కూలీలు పనిచేయడం ఎంత కష్టమో.. నగదు ఉపసంహరించుకోవడం అంతే కష్టంగా మారింది. డబ్బులొచ్చాయని తెలిసిన వెంటనే తపాలశాఖ కార్యాలయాల ముందు బారులుతీరాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరుసల్లో నిల్చోవాలి. డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ బాధలు తప్పనున్నాయి. కూలీలు అవసరమైనప్పుడు డ్రా చేసుకోవచ్ఛు

క్షేత్రస్థాయిలో ఆరా

కూలీల బ్యాంకు ఖాతాలను ఈ నెలాఖరు నాటికి అనుసంధానం చేయాలని సూచించడంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పరిశీలిస్తున్నారు. వివరాలివ్వని వారికి ఫోన్‌ చేయడం, గ్రామాల్లో చాటింపు వేయించడం చేస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ చేస్తున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని