logo
Updated : 27/11/2021 04:33 IST

ఖాళీలు 1157.. భర్తీ ?

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

ఉపాధ్యాయ స్థానాల లెక్క తేలింది. ఇక భర్తీనే మిగిలింది. జిల్లాల పునర్విభజన అనంతరం బదిలీలు ఆగిపోయాయి. సొంత జిల్లాలకు తిరిగి చేరుకోవాలని ఉపాధ్యాయులు ఆశతో నిరీక్షిస్తున్నారు. కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో పోస్టుల వివరాలను జిల్లా విద్యాధికారులు సిద్ధం చేశారు. దీనిపై ఇటీవల డీఈవో, ఎంఈవోలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యాల వారీగా జిల్లాకు మంజూరైనవి, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు లెక్కతేల్చారు.

ఎన్ని ఉన్నాయంటే..

జిల్లాలో 1,157 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఎస్జీటీ 482, స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘికశాస్త్రం 143, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు 114, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం 103 ఉన్నాయి.

ప్రకటనకు నిరీక్షణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017లో టీఆర్‌టీ నిర్వహించింది. వీటి భర్తీనే మొన్నటి వరకు కొనసాగింది. అదే సంవత్సరం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేల- 35 వేల వరకు పోస్టులు భర్తీ చేస్తామని చెబుతున్నా ఆచరణలో అమలు కావడం లేదు. గతేడాది డిసెంబరులో నెల రోజుల్లో చర్యలు చేపడతామని సర్కారు ప్రకటించింది. 11 నెలలు గడిచినా అతీగతీ లేదు. ఈసారైనా నియామకాల ప్రక్రియ చేపట్టాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని