logo
Published : 27/11/2021 04:33 IST

కాలభైరవ ఆలయంలో లక్ష దీపార్చన

జ్యోతులు వెలిగిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు

ఇస్సన్నపల్లి(రామారెడ్డి), న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరు గాంచిన కాలభైరవ స్వామి ఆలయంలో లక్ష దీపార్చన కార్యక్రమాన్ని ఎంపీపీ దశరథ్‌రెడ్డి, ఆలయ పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్‌ బెజుగం మాలతి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఉదయం నుంచి సంతత ధారాభిషేకం నిర్విరామంగా సాగింది. ఓం..ఓం భైరవ .. ఓం కాలభైరవ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు మూల విగ్రహానికి జలాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం పండితులు వేద మంత్రాలతో లక్ష దీపార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వివిధ ఆకృతుల దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో ఈవో శ్రీరామ్‌ రవీందర్‌, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

తరలివచ్చిన భక్తులు, చిన్నారులు

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని